: అమీర్ ఖాన్, సచిన్ లతో కలసి సినిమా చూసిన సన్నీ లియోన్
స్టార్ హీరో అమీర్ ఖాన్ తో కలసి బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ సినిమా చూసింది. అమీర్ నటించిన 'దంగల్' సినిమా ఈ నెల 23న క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ కానుంది. లెజెండరీ రెజ్లర్ మహవీర్ సింగ్ ఫోగట్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ఈ ఉదయం ముంబైలో పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులకు 'దంగల్' సినిమా స్పెషల్ షో వేశారు. ఈ షోకు సన్నీలియోన్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ లతో పాటు మహవీర్ సింగ్ ఫోగట్ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. ఈ సినిమా తెలుగులో 'యుద్ధం' పేరుతో రిలీజ్ కానుంది. మరోవైపు, ఈ సినిమాను ఇప్పటికే రజనీకాంత్ కు, ఆయన కుటుంబ సభ్యులకు ఓ స్పెషల్ షో ద్వారా అమీర్ చూపించాడు.