income tax rides: సీఎస్ ఇంట్లో ఐటీ దాడులు జరపడం తమిళనాడు చరిత్రలోనే లేదు: స్టాలిన్
ఈ రోజు తెల్లవారు జాము నుంచి చెన్నయ్‌లోని అన్నానగర్‌లోని తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్శదర్శి రామ్మోహన్‌రావు ఇంట్లో ఆదాయపన్ను శాఖ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. సీఎస్‌పై ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తుండడంతో ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ నేతలు అన్నాడీఎంకే ప్రభుత్వంపై విమర్శలకు గురిపెట్టారు. డీఎంకే నేత స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ అన్నాడీఎంకే పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమిళనాడు రాష్ట్ర చరిత్రలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై ఐటీ శాఖ దాడులు చేయడం ఇంతవరకు జరగలేదని, ఇదే ప్రథమమని ఆయన అన్నారు. సీఎస్ నివాసంపై ఐటీ దాడులు నిర్వహిస్తుండడం రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తోందని ఆయన మండిపడ్డారు.