: అప్పుడు పాక్ లో జరిగిందే ఇప్పుడు ఇండియాలో జరిగింది... పాక్ జెర్సీ ధరించినందుకు అరెస్ట్ చేసి, జైల్లో పెట్టారు

పాకిస్థాన్ జెర్సీ ధరించి క్రికెట్ చూడ్డానికి వెళ్లిన ఓ భారత క్రికెట్ అభిమానిని పోలీసులు అరెస్ట్ చేసి, జైల్లో పెట్టారు. ఈ ఘటన అసోంలోని హైలకాండి జిల్లాలో జరిగింది. రిపున్ చౌదరి అనే యువకుడికి క్రికెట్ అంటే పిచ్చి. పాకిస్థాన్ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిదీకి ఇతను వీరాభిమాని. స్థానికంగా జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్ ను చూసేందుకు అతను పాకిస్థాన్ జెర్సీని ధరించి వచ్చాడు. దీంతో, భారతీయ మువ మోర్చా కమిటీ సభ్యులు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం, పోలీసులు రిపున్ ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి, జైల్లో పెట్టారు. గతంలో పాకిస్థాన్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఉమెర్ డరాజ్ అనే యువకుడికి విరాట్ కోహ్లీ అంటే అమితమైన ఇష్టం. ఈ అభిమానంతో తన ఇంటిపై భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. దీంతో, అతనిపై దేశద్రోహ నేరం కింద కేసు నమోదు చేసి... పదేళ్ల పాటు జైలు శిక్షను విధించారు.

More Telugu News