: భారతీ సిమెంట్స్ కేసులో జగన్ కు స్వల్ప ఊరట... ఈడీ చర్యలకు హైకోర్టు బ్రేక్
వైకాపా అధినేత వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో భాగంగా, భారతి సిమెంట్స్ కు సంబంధించిన స్థిర, చరాస్తులు, ఫిక్సెడ్ డిపాజిట్ల ప్రాథమిక జప్తును సమర్థిస్తూ అడ్జుడికేటింగ్ అథారిటీ నవంబర్ 23న జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. వీటి అమలుకు సంబంధించి తదుపరి చర్యలేవీ తీసుకోవద్దంటూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ను ఆదేశించింది. ఉత్తర్వులపై నిందితులు అపీలు చేసుకునే అవకాశం ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డ హైకోర్టు, అపీలుపైనా వాదనలు పూర్తి అయి, తుది నిర్ణయం వెలువడే వరకూ చర్యలు తీసుకోరాదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో ఆదేశించారు. దీంతో ఈ కేసులో జగన్ కు స్వల్ప ఊరట లభించినట్లయింది.