: వర్మా! నీకు సైకిల్ ఛెయిన్ కావాలా? సినిమాలు కావాలా? నిర్ణయించుకో!: బి.గోపాల్


 రాంగోపాల్ వర్మ మంచి దర్శకుడని సీనియర్ దర్శకుడు బి.గోపాల్ కితాబునిచ్చారు. వర్మను చూసి గర్విస్తున్నామని ఆయన చెప్పారు. 'శివ టు వంగవీటి' వేడుకలో ఆయన మాట్లాడుతూ, 'చౌదరి చెబుతుంటే విన్నాను, సినిమాలు మానేస్తానన్నావట. అది సరికాదు' అంటూ హితవు పలికారు. 'నీకు సినిమాలు తప్ప ఇంకేమీ తెలియదు... మరి సినిమాలు మానేసి ఏం చేస్తావు?' అని అడిగారు. 'నీ నిర్ణయం మార్చుకో... ఒకవేళ నువ్వు నీ నిర్ణయం మార్చుకోకుంటే నేను, చౌదరి, హరీష్ శంకర్, పూరీ, ఇతర శిష్యులతో కలిసి సైకిల్ చైన్లు పట్టుకుని వస్తాము... నువ్వే నిర్ణయించుకో... నీకు సైకిల్ ఛైన్లు కావాలా? లేక సినిమాలు తీయడం కావాలా?' అని ఆయన అనగానే... వర్మతో కలిసి రాజమౌళి, పూరీ, హరీష్ శంకర్ తదితరులంతా గట్టిగా నవ్వేశారు. 

  • Loading...

More Telugu News