: కన్నతల్లి కర్కశత్వం.. చిన్నారిని చిత్రహింసలు పెట్టిన వైనం!

ప్రేమను పంచాల్సిన అమ్మ..కర్కశంగా ప్రవర్తించిన దారుణ సంఘటన ఢిల్లీలో జరిగింది. ఢిల్లీకి చెందిన షబ్నం అనే మహిళ తన   మూడేళ్ల చిన్నారిని  చిత్రహింసలు పెట్టిన వైనం వెలుగులోకి వచ్చింది. పాలు కారే ఆ చిన్నారని నేలకు విసిరికొట్టడమే కాకుండా, తన కాలి చెప్పు తీసి ఎడాపెడా బాదింది. ఈ సంఘటన చూసిన పొరుగువారు  పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఈ సంఘటన వీడియోకి చిక్కడంతో సామాజిక మాధ్యమాలకు చేరి వైరల్ గా మారింది. ఈ విషయం తెలుసుకున్న షబ్నం అత్తమామలు ఈ మేరకు ఢిల్లీ కమిషన్ ఆఫ్ ఉమెన్ కు ఫిర్యాదు చేశారు. 

More Telugu News