: షీనా బోరా హత్యకేసులో నా తండ్రిని అన్యాయంగా కేసులో ఇరికించారు: పీటర్ ముఖర్జియా కుమారుడు రాహుల్

దేశవ్యాప్తంగా కలకలం రేపిన షీనా బోరా హత్యకేసులో తన తండ్రి పీటర్ ముఖర్జియాను అన్యాయంగా ఇరికించారని ఆయన తనయుడు రాహుల్ ఆరోపిస్తున్నాడు. ఈ కేసు వెలుగు చూసిన అనంతరం మీడియాకు దొరకకుండా అజ్ఞాతంలో ఉన్న రాహుల్‌ అకస్మాత్తుగా బయటకు వచ్చి సరికొత్త డిమాండ్ చేయడం కుతూహలం రేపుతోంది. జరిగిన సంఘటనకు, తన తండ్రికి ఎలాంటి సంబంధం లేదని రాహుల్ ట్విట్టర్ లో స్పష్టం చేశాడు. తన తండ్రిపై కేసు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాడు. కాగా, రాహుల్‌, షీనా ప్రేమించుకున్నారని, వారిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారని, అది ఇష్టం లేక 2012 ఏప్రిల్‌ లో షీనాను ఆమె తల్లి ఇంద్రాణి దారుణంగా హత్య చేసిందని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రాహుల్‌ తండ్రి పీటర్‌ ముఖర్జియా, ఇంద్రాణి, ఆమె డ్రైవరు, ఇంద్రాణి మొదటి భర్త ప్రస్తుతం జైల్లో ఉన్నసంగతి తెలిసిందే.

More Telugu News