: సరికొత్త వ్యూహంతో భారత్ పై దాడికి పాకిస్థాన్ ఉగ్రవాదుల కుట్ర
సరికొత్త వ్యూహంతో దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు చేసేందుకు ఐఎస్ఐ, పాకిస్థాన్ ఉగ్రవాదులు కుట్ర చేసినట్టు ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. నియంత్రణ రేఖ వెంబడి కొందరు తాలిబాన్ ఉగ్రవాదులను గమనించినట్టు ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. దీంతో వారిపై దృష్టి పెట్టిన ఇంటెలిజెన్స్ డిటెక్టివ్ లు వారి సంభాషణలను గమనించారు. వారంతా ఫష్తూన్ భాషలో మాట్లాడినట్టు గుర్తించారు. తాలిబన్లను ఐఎస్ఐ, ఆఫ్ఘన్ ఉగ్రవాదుల సాయంతో భారత్ లో చొరబడేలా చేసి, దేశవ్యాప్తంగా దాడులు జరిపేలా కుట్ర చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఉగ్రవాదులకు స్వాత్ లోయలోని టోరాబోరా పర్వత ప్రాంతంలో శిక్షణ ఇస్తున్నట్టు కూడా వారు తెలపడం విశేషం.