: ‘పాక్’లో ‘దంగల్’ మూవీ విడుదల చేయట్లేదట !


ఈ నెల 23న బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్’ చిత్రం దేశ వ్యాప్తంగా విడుదల కానుంది. పొరుగు దేశమైన పాకిస్థాన్ లో కూడా ఈ చిత్రం విడుదల చేయనున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘దంగల్’ డిస్ట్రిబ్యూటర్ల అధికార ప్రతినిధి ఒక ప్రకటన చేశారు. పాకిస్థాన్ లో ‘దంగల్’ చిత్రాన్ని విడుదల చేయడం లేదని స్పష్టం చేశారు. ఇందుకు వ్యతిరేకంగా వస్తున్న వార్తలను నమ్మవద్దని ఈ సందర్భంగా కోరారు.

కాగా, జమ్మూకాశ్మీర్ లో యురీ సంఘటన అనంతరం రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పాక్ లో భారతీయ చిత్రాల ప్రదర్శనను నిలిపివేశారు. దీంతో, 150 మిలియన్లు నష్టపోయామని, వంద మంది తమ ఉద్యోగాలు కోల్పోయారని  సంబంధిత అధికారి ఒకరు గతంలో ప్రకటించారు. తాజాగా, నిన్నటి నుంచి భారతీయ చిత్రాలను పాకిస్థాన్ థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. 

  • Loading...

More Telugu News