: గవర్నర్ నరసింహన్ తో భేటీ అయిన వైఎస్ జగన్
ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రాజ్‌భవన్‌కు వెళ్లారు. అక్కడ గవర్నర్ నరసింహన్‌తో ఆయన భేటీ అయ్యారు. పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి నరసింహన్‌కు జగన్ వివరించి చెబుతున్నారు. జగన్‌తో పాటు పలువురు వైసీపీ నేతలు కూడా ఉన్నారు. గత 42 రోజులుగా రాష్ట్రంలోని రైతులు, సామాన్యులు, చిరు వ్యాపారులు ఎదుర్కుంటున్న కష్టాలను, వ్యాపారులు నష్టపోతున్న అంశాలను గురించి ఆయన గవర్నర్‌కు వివరిస్తున్నట్లు వైసీపీ పార్టీ వర్గాలు తెలిపాయి.