: దేశం విడిచి వెళ్లేందుకు మాజీ ఆర్మీ చీఫ్ రహీల్ నాకు సహకరించారు: ముషారఫ్
తాను దేశాన్ని విడిచి వెళ్లేందుకు మాజీ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ సహకరించారని పాక్ మాజీ అధక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ తెలిపారు. ఓ న్యూస్ ఛానల్ లో ప్రసారం అయిన టాక్ షోలో ఆయన మాట్లాడుతూ ఈ రహస్యాన్ని వెల్లడించారు. తనకు సహాయం చేసినందుకు రహీల్ కు కృతజ్ఞతలు కూడా చెప్పానని తెలిపారు. తాను గతంలో ఆర్మీ చీఫ్ గా పనిచేసినప్పుడు, రహీల్ తన కింద పని చేశారని చెప్పారు. ఆయనకు తాను బాస్ గా పనిచేయడం వల్లే తనకు ఆయన సహాయం చేశారని చెప్పుకొచ్చారు. తనపై ఉన్న కేసులన్నీ రాజకీయ దురుద్దేశంతో పెట్టినవే అని ముషారఫ్ చెప్పారు. కోర్టులన్నీ రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతాయని... కోర్టులపై ప్రభుత్వాల ఒత్తిడి ఉండరాదనే తాను దేశం విడిచి వెళ్లేలా రహీల్ సహకరించారని తెలిపారు.