: 26 మంది పాకిస్థాన్ జాలర్లను అరెస్ట్ చేసిన గస్తీ దళం
గుజరాత్ తీరంలోని సముద్రజలాల్లో సరిహద్దులు దాటి భారత ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించిన 26 మంది పాకిస్థాన్ జాలర్లను తీరప్రాంత గస్తీ దళం అదుపులోకి తీసుకుంది. వారికి చెందిన 5 పడవలను కూడా స్వాధీనం చేసుకుంది. వీరిని విచారించడానికి జకావు పోర్టుకు తరలించారు. గస్తీ నౌక సీ-419 ద్వారా వీరిని అదుపులోకి తీసుకున్నారు. గత నెలలో తమ జలాల్లోకి ప్రవేశించారని ఆరోపిస్తూ 43 మంది భారతీయ జాలర్లను పాక్ సైన్యం అదుపులోకి తీసుకున్న సంగతి విదితమే.