: బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన స్వామి స్వరూపానంద


బీజేపీ ప్రభుత్వంపై విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద విమర్శలు గుప్పించారు. తిరుమలకు ఈరోజు విచ్చేసిన స్వామీజీ ఈ సందర్భంగా మాట్లాడుతూ,ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో బీజేపీ విఫలమైందని అన్నారు. స్వచ్ఛ గంగ పథకం ఇంతవరకూ ప్రారంభించలేదని, గో సంరక్షణకు, గోవధ నిషేధానికి సంబంధించి సరైన చర్యలు చేపట్టలేదని ఆయన ఆరోపించారు. తిరుమల కొండపై నుంచి విమానాలు వెళ్లడం సబబుకాదని, సాంప్రదాయక పద్ధతులను అనుసరించి దీనిని అంగీకరించమని అన్నారు. ఈ విషయంలో కూడా బీజేపీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని స్వామి స్వరూపానంద ఆరోపించారు.

  • Loading...

More Telugu News