: విహారయాత్రకు శ్రీశైలం వెళుతుండగా స్కూలు బస్సు బోల్తా... 15 మంది విద్యార్థులకు గాయాలు
కర్నూలులో ఈ రోజు ఉదయం బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని సంజమాల మండలం రెడ్డిపల్లి వద్ద ఓ పాఠశాల బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిపి మొత్తం 68 మంది ఉన్నారు. అందులో 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని పోలీసులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ బస్సులో ప్రయాణిస్తున్నది అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాళ్ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులుగా గుర్తించారు. విద్యార్థులంతా శ్రీశైలం విహారయాత్రకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.