: రైలు ప్రయాణికులకు శుభవార్త.. అందుబాటులోకి రానున్న అదనపు ఆర్ఏసీ కోటా


రైలు ప్రయాణికులకు శుభవార్త. కొత్త ఏడాది జనవరి 16 నుంచి అన్ని రైళ్లలోను అదనపు ఆర్ఏసీ కోటాను ప్రయాణికులకు అందుబాటులో ఉంచనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ తాజా నిర్ణయం ద్వారా స్లీపర్, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ ల్లో ఆర్ఏసీ విభాగంలో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతుంది. గతంలో అయితే,  స్లీపర్, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ ల్లో ఆర్ఏసీ కింద 18 మంది మాత్రమే ప్రయాణించే అవకాశముండేది. ప్రస్తుతం రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయంతో అదనంగా మరో 10 మంది ప్రయాణికులకు అదనపు ఆర్ఏసీ కోటా ద్వారా ప్రయోజనం దక్కనుంది.
 

  • Loading...

More Telugu News