utham kumar reddy: తెలంగాణ శాసనసభ స్పీకర్‌ తన తీరును మార్చుకోవాలి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణ శాసనసభలో నిన్న కాంగ్రెస్ నేతలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. స్పీకర్ మధుసూదనాచారి తీసుకున్న ఈ నిర్ణ‌యంపై టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి మండిప‌డ్డారు. స్పీక‌ర్‌ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఆయ‌న అన్నారు. ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ... పార్టీ ఫిరాయింపులపై మాట్లాడితే స‌భ్యుల‌ను స‌స్పెండ్ చేయ‌డ‌మేంట‌ని ప్ర‌శ్నించారు. స్పీకర్ మ‌ధుసూద‌నాచారి త‌న ధోర‌ణిని మార్చుకోక‌పోతే ఆయ‌న‌పై తాము అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతామని అన్నారు.  
utham kumar reddy

More Telugu News