: వారిలో పశ్చాత్తాపం లేదు...ఉరిశిక్ష వేయండి: పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదన
దిల్ షుక్ నగర్ పేలుళ్ల నిందితుల్లో ఎలాంటి పశ్చాత్తాపం లేదని ఈ కేసును వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. ఈ కేసులో విచారణ సందర్భంగా పలు ఆసక్తికర వాదనలు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. నిందితులు కావాలని అమాయకులను పొట్టనబెట్టుకున్నారని ఆయన తెలిపారు. వీరికి మరణించే వరకు ఉరిశిక్షే సరైనదని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో 157 మంది సాక్షులను విచారించిన అనంతరం వారిని ప్రశ్నించిన సందర్భంగా వారి వైఖరి ఊహించని విధంగా ఉందని, నిందితుల్లో తీవ్ర వైఖరి ఉందని న్యాయస్థానానికి తెలిపారు. చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుని బయటపడాలని నిందితులు తీవ్రంగా ప్రయత్నించారని ఆయన న్యాయస్థానం ముందుకు తీసుకొచ్చారు. వారిని ఉపేక్షించకూడదని, భవిష్యత్ లో ఎవరూ ఇలాంటి చెడుమార్గం పట్టకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు.