: స్వాతంత్ర్యానికి ముందు చంద్రబాబు లేకపోవడం మన అదృష్టం!: జగన్ వ్యంగ్యం


భారత దేశానికి స్వాతంత్ర్యం రాకముందు నాటి కాలంలో చంద్రబాబునాయుడు లేకపోవడం మన అదృష్టమని వైఎస్సార్సీపీ అధినేత జగన్ అన్నారు. విజయనగరంలో నిర్వహించిన యువభేరిలో ఆయన మాట్లాడుతూ, ఒకవేళ అయన స్వాతంత్ర్యానికి పూర్వం ఉండి ఉంటే... ఇప్పుడు ప్రజలను మోసం చేసినట్టే అప్పుడు కూడా మోసం చేసి ఉండేవారని అన్నారు. ఇప్పుడైతే కేవలం ప్రత్యేకహోదా మాత్రమే వద్దన్నారని, అప్పుడైతే వీరికి స్వాతంత్ర్యం అవసరంలేదు...స్వాతంత్ర్యానికి సమానమైనదని మరేదో ఇప్పించి ఉండేవాడని ఆయన ఎద్దేవా చేశారు.

 చంద్రబాబునాయుడు డీమోనిటైజేషన్ కు రెండు రోజుల ముందు తన హెరిటేజ్ రిటైల్ షేర్లు అమ్మేశారని అన్నారు. అంతకు ముందు చంద్రబాబు హెరిటేజ్ షేర్ ధర కేవలం 199 రూపాయలు ఉంటే ఆయన షేరు ధర 919 రూపాయల చొప్పున అమ్మేశారని అన్నారు. దీనిని ఇన్ సైట్ ట్రేడింగ్ అనరా? అని ఆయన ప్రశ్నించారు. డీమోనిటైజేషన్ కు అనుకూలంగా నెల రోజుల ముందు ప్రధానికి చంద్రబాబు లేఖ రాశారని జగన్ తెలిపారు. దీంతో చంద్రబాబు వేల కోట్ల రూపాయలు చక్కబెట్టుకుని ఆ తరువాత సామాన్యప్రజానీకాన్ని ఇబ్బంది పెడుతున్నారని ఆయన చెప్పారు. 

  • Loading...

More Telugu News