: 19 ఏళ్ల ప్యూర్టోరికో సుందరికి మిస్ వరల్డ్ కిరీటం


మిస్ వరల్డ్ 2016 కిరీటాన్ని ప్యూర్టోరికో సుందరి స్టెఫానీ డెల్ వాల్లె కైవసం చేసుకుంది. అమెరికాలోని మేరీల్యాండ్ లో జరిగిన ఫైనల్స్ లో సగర్వంగా అందాల కిరీటాన్ని ధరించింది. ఫైనల్లో స్టెఫానీతో పాటు కెన్యా, డొమినికన్ రిపబ్లిక్, ఫిలిప్పైన్స్, ఇండొనేషియాలకు చెందిన అందాల భామలు పోటీపడ్డారు. స్టెఫానీ వయసు 19 ఏళ్లు. ఈమె స్పానిష్, ఫ్రెంచ్, ఇంగ్లీష్ భాషలను మాట్లాడగలదు. ఎంటర్ టైన్ మెంట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలనేదే ఆమె లక్ష్యం.

భారత్ కు చెందిన ప్రియదర్శిని టాప్-20కి చేరినప్పటికీ... టాప్-5 లోకి అడుగుపెట్టలేకపోయింది. 2000లో భారత్ నుంచి చివరిసారిగా ప్రియాంకాచోప్రా మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది. అంతకు ముందు ఐశ్వర్యారాయ్, యుక్తాముఖి, డయానా హెడెన్, రీతా ఫారియా తదితరులు ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్నారు.


  • Loading...

More Telugu News