: దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల నిందితులకు శిక్ష ఖరారు నేడే


దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో నిందితులకు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు నేడు శిక్షను ఖరారు చేయనుంది. గత మూడున్నరేళ్లుగా కొనసాగుతున్న ఈ కేసు విచారణ ఈ నెల 13న ముగిసిన సంగతి తెలిసిందే. 2013 ఫిబ్రవరి 21వ తేదీ సాయంత్రం జరిగిన బాంబు పేలుళ్లలో 18 మంది దుర్మరణం పాలయ్యారు. 138 మంది గాయపడ్డారు. ఆ తర్వాత కేసును దర్యాప్తు చేసిన ఎన్ఐఏ... దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఐదుగురిని అదుపులోకి తీసుకుంది. మరోవైపు, ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పును నిందితులు హైకోర్టులో అప్పీలు చేయనున్నారని సమాచారం. ఇప్పటికే నిందితుల తరపు న్యాయవాది సంబంధిత డాక్యుమెంట్లపై ఐదుగురు నిందితుల నుంచి సంతకాలు తీసుకొని వెళ్లినట్టు తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News