: ఈ ఫొటో తీయడానికి ఆరేళ్లు కష్టపడ్డాడు!


పక్కనున్న దృశ్యాన్ని తన కెమెరాలో బంధించడానికి ప్రముఖ ఫొటోగ్రాఫర్ అలాన్ మెక్ ఫాడియెన్ ఏకంగా ఆరేళ్ల పాటు కష్టపడ్డాడు. స్కాట్లండ్ కు చెందిన అలాన్ అత్యంత పర్ ఫెక్ట్ గా ఉన్న ఈ ఫొటోను తీయడానికి 7 లక్షలకు పైగా ఫొటోలను తీశాడు. నీళ్లలోకి దూసుకొస్తున్న కింగ్ ఫిషర్ ఫొటోనే ఇది. ఈ సందర్భంగా అలాన్ మాట్లాడుతూ, ప్రతి సీజన్ లో ఎన్నో ఫొటోలు తీసినప్పటికీ... ఒక్క ఫొటో కూడా తాను కోరుకున్నట్టు రాలేదని చెప్పాడు. చివరకు ఆరేళ్ల తర్వాత తన శ్రమ ఫలించిందని... ఈ లక్కీ షాట్ ను ఇన్నాళ్లకు తీయగలిగానని తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. 

  • Loading...

More Telugu News