: నోట్ల రద్దు రూ.8 లక్షల కోట్ల కుంభకోణం.. తనవద్ద ఆధారాలు ఉన్నాయన్న కేజ్రీవాల్
పెద్దనోట్ల రద్దును తొలినుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీపై మరోమారు నిప్పులు చెరిగారు. నోట్ల రద్దు రూ.8 లక్షల కోట్ల కుంభకోణమని, ప్రధాని అవినీతిపై తన వద్ద ఆధారాలున్నాయని పేర్కొన్నారు. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ఆదివారం లక్నోలో నిర్వహించిన సభలో కేజ్రీవాల్ మాట్లాడుతూ ప్రధానిపై తీవ్ర ఆరోపణలు చేశారు.
నోట్ల రద్దు అంటే పరోక్షంగా బడాబాబుల బ్యాంకు రుణాలను రద్దు చేయడమేనని ఆరోపించారు. వారికి లబ్ధి చేకూరుస్తున్న ప్రభుత్వానికి రైతుల రుణాలను రద్దు చేసేందుకు మాత్రం చేతులు రావడం లేదన్నారు. అప్పట్లో గుజరాత్ సీఎంగా ఉన్న మోదీకి బిర్లా గ్రూప్ నుంచి భారీగా ముడుపులు అందాయని తేలిందన్నారు. దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.