: గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలను స్వాగతిస్తున్నాం: సబితా ఇంద్రారెడ్డి
హిమాయత్ సాగర్, ఉస్మాన్ నగర్ పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాలకు నీరు అందించే అంశం ఉన్న జీవో నంబర్ 111ను పున:సమీక్షించాలని గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఇరవై ఏళ్లుగా తాము చేస్తున్న పోరాటం ఫలించిందని, ఈ జీవోపై సమీక్షించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి గ్రీన్ ట్రైబ్యునల్ ఇచ్చిందని అన్నారు. ఈ ఆదేశాలపై తెలంగాణ ప్రభుత్వం తక్షణం స్పందించి ఒక నివేదిక ఇవ్వాలని ఆమె కోరారు.