: ముఫ్పైవేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు ఆ పాట రాశారు: దర్శకుడు క్రిష్


ముఫ్పైవేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో ‘గౌతమి పుత్ర శాతకర్ణి’  చిత్రంలోని బ్యాక్ గ్రౌండ్ పాట కోసం ఒక సాంగ్ ను ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారట. ఈ విషయాన్ని దర్శకుడు క్రిష్  తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా తెలిపారు. ముంబయి నుంచి హైదరాబాద్ కు విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ పవర్ ఫుల్ సాంగ్ ను ఆయన రాశారని అన్నారు.  ‘గ్రేట్ సాల్యూట్స్ టు గురువుగారు...’ అని ఆ పోస్ట్ లో  పేర్కొన్న క్రిష్, విమానంలో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.  కాగా, ‘గౌతమి పుత్ర శాతకర్ణి’  చిత్రం ట్రైలర్ ఈరోజు విడుదలైంది.

  • Loading...

More Telugu News