: ‘కాంగ్రెస్’ కు గుడ్ బై చెప్పిన గోవా ఎమ్మెల్యే


గోవాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే మవున్ గోడినో ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేశారు. సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ సమక్షంలో ఈరోజు ఆయన బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ లేకపోవడం వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, ఈరోజు ఉదయం కాంగ్రెస్ పార్టీకి, తన పదవికి రాజీనామా సమర్పించినట్లు చెప్పారు. కాగా, దక్షిణగోవాలోని దబోలిమ్ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు మవున్ ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో మంత్రిగానూ ఆయన పనిచేశారు.

  • Loading...

More Telugu News