: సీఎం కేసీఆర్ తన స్టేట్ మెంట్ ను సవరించుకోవాలి: రేవంత్ రెడ్డి
పెద్దనోట్లను కేంద్రం రద్దు చేయలేదని, ఆ నోట్ల స్థానంలో కొత్త నోట్లు తీసుకువచ్చిందని..సీఎం కేసీఆర్ తన స్టేట్ మెంట్ ను సవరించుకోవాలని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. ‘నగదు రద్దు వల్ల మూడు నెలల ఆదాయం తగ్గుతుంది’ అని తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పెద్దనోట్ల రద్దుపై చర్చ సందర్భంగా కేసీఆర్ అనగానే స్పందించిన రేవంత్ పైవిధంగా వ్యాఖ్యలు చేశారు. నగదును పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని, గ్రామీణ ప్రాంతాల్లో కరెన్సీ నోట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వానికి సూచించిన రేవంత్ రెడ్డి, తెలంగాణలోని వ్యాపారులకు ఉచితంగా స్వైపింగ్ మిషన్లు పంపిణీ చేయాలని ఆయన సూచించారు.