: 35 ఏళ్ల తరువాత భారత్ లో రికార్డు నెలకొల్పిన రూట్
ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ భారత్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో 35 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. 50 అంతకంటే ఎక్కువ పరుగులు ఐదుసార్లు సాధించిన ఆటగాడిగా జోరూట్ నిలిచాడు. 35 ఏళ్ల క్రితం 1981లో గ్రాహం గూచ్, ఇయాన్ బోథం గతంలో భారత్ లో వరుసగా నాలుగు సార్లు అర్ధసెంచరీ అంతకంటె ఎక్కువ పరుగులు సాధించారు. అనంతరం ఇంత వరకు ఏ దేశానికి చెందిన ఆటగాడూ ఈ ఫీట్ సాధించలేదు. భారత్ తో జరుగుతున్న సిరీస్ లో రూట్ ఐదు సార్లు అర్ధ సెంచరీ సాధించి, తన అద్భుతమైన ఫాంను చాటాడు.