: నా తదుపరి సినిమా పేరు 'శశికళ': బాంబు పేల్చిన రామ్ గోపాల్ వర్మ


ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో బాంబు పేల్చాడు. తన తదుపరి సినిమా పేరు 'శశికళ' అని ప్రకటించాడు. శశికళ అనే పేరుతో ఓ ఫిక్షనల్ డ్రామాను తెరకెక్కించనున్నానని... ఓ రాజకీయ నాయకురాలి ప్రియ స్నేహితురాలి జీవితం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని ట్విట్టర్లో వర్మ తెలిపాడు. ఈ పేరును ఇప్పటికే రిజిస్టర్ చేయించినట్టు చెప్పాడు. తనకు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అంటే చాలా గౌరవమని... శశికళ అంటే అంతకుమించిన గౌరవమని తెలిపాడు.

జయ మరణంతో తమిళ రాజకీయాలు అస్తవ్యస్తంగా మారాయి. అమ్మ పోయి చిన్నమ్మ వచ్చింది. మొన్నటిదాకా జయ కాళ్లకు మొక్కిన వారు, ఇప్పుడు శశికళ కాళ్లకు మొక్కుతున్నారు. ఈ నేపథ్యంలో, వర్మ 'శశికళ' సినిమా ఎన్ని ఉద్రిక్తతలకు దారి తీస్తుందో వేచి చూడాలి. 

  • Loading...

More Telugu News