: జయలలితకు నివాళిగా బ్లాక్ బ్యాండ్ లు ధరించిన ఆటగాళ్లు


తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతికి సంతాపంగా క్రికెటర్లు బ్లాక్ బ్యాండ్ ధరించారు. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో టీమిండియా-ఇంగ్లండ్ జట్ల మధ్య చివరి టెస్టు మ్యాచ్ నేడు ప్రారంభమైంది. ఈ సందర్భంగా తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ జయలలిత మృతికి సంతాప సూచకంగా బ్లాక్ బ్యాండ్ ధరించాలని ఆటగాళ్లను కోరింది. ఈ సందర్భంగా తమిళనాడు రాష్ట్రానికి చేసిన సేవలు, ముఖ్యమంత్రిగా క్రికెట్ కు ఆమె అందించిన సహకారానికి గౌరవసూచకంగా బ్యాండ్ ధరించాలని వివరించింది. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు తమ చేతులకు బ్లాక్ బ్యాండ్ ధరించి మైదానంలోకి దిగారు. 

  • Loading...

More Telugu News