: ఇంగ్లండ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ... జెన్నింగ్స్ ను పెవిలియన్ చేర్చిన కొత్త పెళ్లికొడుకు!


చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరుగుతున్న చివరి టెస్టులో ఇంగ్లండ్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 7 పరుగులకు ఇంగ్లండ్ తొలి వికెట్ ను కోల్పోయింది. ఓపెనర్ జెన్నింగ్స్ ను కొత్త పెళ్లికొడుకు ఇషాంత్ శర్మ పెవిలియన్ చేర్చాడు. ఆఫ్ స్టంప్ కు వెలుపల ఇషాంత్ వేసిన బంతిని... జెన్నింగ్స్ డ్రైవ్ చేయబోగా... అది ఔట్ సైడ్ ఎడ్జ్ తీసుకుని కీపర్ పార్థివ్ పటేల్ చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు జెన్నింగ్స్. మరోవైపు, మరో ఓపెనర్ కుక్ (6), రూట్ (5)లు క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ ప్రస్తుత స్కోరు వికెట్ నష్టానికి 13 పరుగులు (9 ఓవర్లు). 

  • Loading...

More Telugu News