: బ్యాంకు దోపిడీకి పాల్పడిన ఉగ్రవాదులు...పోలీసులపై స్థానికుల రాళ్లదాడి
జమ్మూకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలోని రంతిపోరా జమ్మూ అండ్ కశ్మీర్ బ్యాంక్ కు చెందిన బ్రాంచ్ లో సాయుధులైన ఉగ్రవాదులు చొరబడి 11 లక్షల రూపాయలు దోచుకుపోయారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం కశ్మీర్ లోని బ్యాంకుల్లో ఉగ్రవాదులు చొరబడి దోచుకెళ్లడం ఇది మూడోసారి కావడం విశేషం. అనంతరం సంఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు చేరుకున్న పోలీసులపైకి స్థానికులు రాళ్లు విసిరారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.