demonitization: ఖాతాదారులకు ఉప‌శ‌మ‌నం.. నగదు విత్‌ డ్రాపై ఉన్న ఆంక్షలను సడలించనున్న స‌ర్కారు

పెద్ద నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో ఖాతాదారులు బ్యాంకుల నుంచి తీసుకునే న‌గ‌దుపై రిజ‌ర్వ్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప‌లు ప‌రిమితులు విధించిన సంగ‌తి తెలిసిందే. అయితే త్వ‌ర‌లోనే నగదు విత్‌ డ్రాపై ఉన్న ఆంక్షలను సడలించనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. వేగంగా కొత్త నోట్ల‌ను ముద్రిస్తోన్న ఆర్‌బీఐ.. 80 శాతం కొత్త కరెన్సీ బ్యాంకులకు వచ్చిన వెంటనే ఆయా నిబంధనలను సడలించనున్నట్లు స‌మాచారం. అలాగే సహకార బ్యాంకులపై ఆంక్షలు కూడా ఎత్తివేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఖాతాదారుల‌ బ్యాంకు జ‌మ‌ల్లో 50 శాతం కొత్త కరెన్సీనే ఉందని అంటున్నారు.
demonitization

More Telugu News