: ఆసక్తికరమై పాత్ర దొరికితే వీధి నాటకానికైనా సిద్ధమే: ‘ధోనీ’ హీరో


ఆసక్తికరమైన పాత్ర దొరికితే వీధి నాటకాలు వేయడానికైనా తాను సిద్ధమేనని ‘ఎంఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ’ చిత్రం హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అన్నాడు. ‘ధోనీ’ విజయం అనంతరం తన తర్వాతి చిత్రాల ఎంపిక విషయమై చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. కథల ఎంపికలో తొందరపడకుండా ఆచితూచి అడుగులు వేస్తున్న సుశాంత్ మాట్లాడుతూ,‘ నటించడంలోనే నాకు ఆనందం ఉంది. ఆసక్తికరమైన పాత్ర  దొరికితే అది టీవీ, వీధినాటకమైనా సరే నటించేందుకే సిద్ధమే. ప్రస్తుతం స్క్రిప్టులు వింటున్నాను. ‘ధోనీ’ చిత్రం అనంతరం రెండు చిత్రాల్లో నటించేందుకు ఒప్పుకున్నాను. ప్రస్తుతం ‘చందమామ దూర్ కే’ అనే చిత్రం కోసం శిక్షణ తీసుకుంటున్నాను’ అని సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చెప్పాడు. 

  • Loading...

More Telugu News