: ‘గాలి’ కుమార్తె పెళ్లికి డబ్బులు మార్చింది నేనే.. అంగీకరించిన భీమానాయక్
గనుల ఘనుడు గాలి జనార్దన్‌రెడ్డి కుమార్తె వివాహానికి నల్ల ధనాన్ని తెల్లగా మార్చింది తానేనని సీఐడీ అదుపులో ఉన్న బీమానాయక్ అంగీకరించాడు. వివాహానికి అవసరమైన ధనాన్ని తానే సమకూర్చానని ఆయన పేర్కొన్నాడు. గాలి జనార్దన్‌రెడ్డితోపాటు బళ్లారి ఎంపీ శ్రీరాములుతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని తెలిపాడు. వారి సూచన మేరకే తాను నోట్లను మార్చానని అధికారుల ముందు అంగీకరించినట్టు తెలిసింది.
లక్షల రూపాయల ఖరీదు చేసే శుభలేఖల నుంచి అతిథుల ప్రయాణం, భోజన ఏర్పాట్ల వరకు గాలి జనార్దన్‌రెడ్డి ఎక్కడా ‘తగ్గకుండా’ ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. కుమార్తె బ్రహ్మణి పెళ్లి కోసం మాజీ మంత్రి అయిన ‘గాలి’ చేసిన ఏర్పాట్లు చూసి దేశం నివ్వెరపోయింది. అదే సమయంలో నోట్లు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పెళ్లి ఎలా చేస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే గాలి మాత్రం నోట్ల రద్దు ప్రభావం తనపై ఏమాత్రం లేదని నిరూపిస్తూ అంతే ఘనంగా పెళ్లి జరిపించారు. దీంతో ప్రభుత్వంపై విపక్షాలు ఎదురుదాడికి దిగిన సంగతి తెలిసిందే.