gavasker on kohli: కోహ్లీకి పదికి 7 మార్కులు వేస్తానంటున్న గవాస్కర్

టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీ ఇవ్వాలంటూ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోహ్లీకి కెప్టెన్సీ పై ఆయన మాట్లాడుతూ, డిమాండ్లకు సెలెక్టర్లు తలొగ్గకూడదని తెలిపారు. కోహ్లీ అద్భుతమైన ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదని తెలిపాడు. 2016 నుంచి బ్యాటుతో కోహ్లీ సంచలన ఇన్నింగ్స్ ఆడుతున్నాడని కితాబునిచ్చారు.

ప్రపంచంలోని ఏ పిచ్ అయినా తనకు తిరుగులేదని నిరూపించుకున్న కోహ్లీ కేవలం ఇంగ్లండ్ లోనే రాణించలేదని తెలిపాడు. కోహ్లీకి మార్కులు వేయాల్సి వస్తే పదికి ఏడు మార్కులు వేస్తానని తెలిపారు. మరికొన్ని విభాగాల్లో కోహ్లీ పరిణతి సాధించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. దీనికి మరికొంత అనుభవం అవసరమని ఆయన చెప్పారు. ఇంగ్లండ్ లో కూడా కోహ్లీ రాణించి సత్తాచాటుతాడని, అది త్వరలోనే జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 
gavasker on kohli

More Telugu News