: రానా.. పెళ్లి ఎప్పుడని అడగనుగానీ..పార్టీ ఎప్పుడు?: యంగ్ హీరో రామ్


టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా ఈరోజు తన 32వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా రానాకు పలువురు సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలుపుతూ ట్వీట్లు చేశారు. ‘హ్యాపీ బర్త్ డే టు ‘బాహుబలి’ రానా’ అని బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ‘భళ్లాలదేవా రానా’ అని ప్రముఖ దర్శకుడు రాజమౌళి, ‘మరింతగా ఎదగాలి (ఆకారంలో కాదు)’ అని నటి రకుల్ ప్రీత్ సింగ్, ‘ఎవరి హృదయమైతే తన కండల కన్నా పెద్దదిగా ఉందో అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని మరో నటి తాప్పీ, ‘ప్రియమైన వ్యక్తికి శుభాకాంక్షలు’ అని దక్షిణాది ముద్దుగుమ్మ సమంత, ‘హ్యాపీ బర్త్ డే టార్జాన్’ అని నటుడు సుధీర్ బాబు ట్వీట్లు చేశారు. కాగా, ఈ సందర్భంగా  యంగ్ హీరో రామ్ చేసిన ట్వీట్ చాలా సరదాగా ఉంది. ‘హ్యాపీ బర్త్ డే టు ఏ గుడ్ ఫ్రెండ్ .. పెళ్లి ఎప్పుడని అడగనులేగానీ...పార్టీ ఎప్పుడు?...’ అని రామ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశాడు.

  • Loading...

More Telugu News