: మేమిద్దరం బిజీగా ఉండటం వల్లే కలుసుకోలేకపోతున్నాం: సల్మాన్ ఖాన్


‘షారుఖ్,, నేనూ బిజీగా ఉండటం వల్లే కలుసుకోవడం లేదు. మా కుటుంబాలు మాత్రం కలిసే ఉన్నాయి’ అని కండలవీరుడు సల్మాన్ ఖాన్ అన్నాడు. 2008లో కత్రినాకైఫ్ పుట్టినరోజు పార్టీకి వెళ్లిన బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు గొడవపడ్డారనే వదంతులు వ్యాపించాయి. అప్పటి నుంచి వీరిద్దరి స్నేహం చెడిందనే వార్తలు కూడా మారుమోగాయి. ఆ విషయం నిజమే అన్నట్లుగా వీరిద్దరూ కలుసుకోవడం మానేశారు. అయితే, వీళ్లిద్దరూ ఇటీవల స్నేహితులైపోయారు.

ఈ నేపథ్యంలో నాటి సంఘటన గురించి సల్మాన్ తాజాగా మాట్లాడుతూ, తమ గురించి చాలా మంది పలు రకాలుగా మాట్లాడుకున్నారని, అయితే, తమ కుటుంబాలు మాత్రం కలిసే ఉన్నాయని చెప్పారు. తామిద్దరం బిజీగా ఉండటం వల్లే కలుసుకోవడం లేదని, ఆ విషయాన్ని మీడియా పెద్దది చేసి చూపించిందని అన్నారు. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో తామిద్దరం మంచి స్నేహితులం అని, సినీ రంగంలో తామిద్దరం ఒకే స్థాయికి చేరుకున్నప్పుడు చాలా మంది తమ బ్రెయిన్ వాష్ చేసేందుకు ప్రయత్నించారని చెప్పారు.

అయితే, వారి మాటలు తమపై ఎటువంటి ప్రభావం చూపలేదని అన్నారు. అమీర్ ఖాన్ విషయంలో కూడా అదే జరిగిందని, అక్షయ్ కుమార్ అంటే ఇష్టమని, ఆయనతో కలిసి రెండు సినిమాల్లో నటించానని, అప్పుడప్పుడు పలకరించుకుంటూ ఉంటామని సల్మాన్ చెప్పాడు. అజయ్ దేవగణ్ చాలా మంచి వ్యక్తి అని, సంజయ్ దత్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన సల్మాన్, సునీల్ శెట్టి, జాకీ ష్రాఫ్... తామంతా తరచుగా కలుసుకోకపోయినప్పటికీ, మంచి స్నేహితులమేనని సల్మాన్ ఖాన్ చెప్పాడు.

  • Loading...

More Telugu News