: టీడీపీ కార్యాలయంలో సందడి చేసిన తారకరత్న
ప్రముఖ సినీ నటుడు నందమూరి తారకరత్న గుంటూరులోని టీడీపీ కార్యాలయాన్ని తొలిసారి సందర్శించారు. నిన్న రాత్రి నగరానికి వచ్చిన ఆయన... టీడీపీ కార్యాలయానికి విచ్చేసి, అక్కడ ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు. ఆ తర్వాత కార్యాలయంలో ఉన్న నేతలతో కలసి, కార్యాలయమంతా కలియదిరిగారు. కార్యాలయంలోని సిబ్బందిని పలకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది తాత్కాలిక రాష్ట్ర కార్యాలయం అయినా, చాలా గొప్పగా తీర్చిదిద్దారని ప్రశంసించారు. తారకరత్నకు తెలుగుదేశం నేతలు కృష్ణమూర్తి, రావిపాటి సత్యనారాయణ, దారపనేని నరేంద్ర, పప్పుల దేవదాసు తదితరులు స్వాగతం పలికారు.