supreme court: జయలలిత మృతిపై అనుమానాలు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన స్వచ్ఛంద సంస్థ

షార్ట్స్‌లో చూడండి
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత చెన్నైలోని అపోలో ఆసుప‌త్రిలో 75 రోజులపాటు చికిత్స తీసుకొని ఇటీవ‌లే కార్డియాక్ అరెస్ట్ తో మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఆమె మృతిపై ప‌లువురు అనేక అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో స్పందించిన ఓ స్వ‌చ్ఛంద సంస్థ జ‌య‌ల‌లిత‌ మృతిపై సుప్రీంకోర్టును ఆశ్ర‌యించి, ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. జ‌య‌ల‌లిత మృతిపై సీబీఐతో విచారణ జ‌రిపించాల‌ని, ఆమెకు సంబంధించిన‌ వైద్య నివేదికలను స్వాధీనం చేసుకోవాలని స‌ద‌రు స్వచ్ఛంద సంస్థ కోర్టులో దాఖ‌లు చేసిన‌ పిటిషన్‌లో పేర్కొంది.
Go Back to Shorts
supreme court

More Telugu News