: మాట్లాడ‌డానికి వ‌చ్చాను.. మాట్లాడ‌నిస్తారో లేదో చూడాలి: రాహుల్ గాంధీ

ప‌లు అంశాల‌ గురించి మాట్లాడ‌డానికి పార్ల‌మెంటుకు వ‌చ్చానని, అయితే అధికారప‌క్ష స‌భ్యులు తనను మాట్లాడ‌నిస్తారో లేదో చూడాలని పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌కు చేరుకున్న‌ కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాల్లో మ‌రో మూడు రోజులు మాత్ర‌మే మిగిలి ఉండ‌డంతో... ఈ చివ‌రి రోజుల్లో స‌భ‌ల్లో జ‌రిగే చ‌ర్చ మ‌రింత గంద‌ర‌గోళానికి తావిస్తుంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న రాజ్య‌స‌భ‌లో వార్దా తుపాను గురించి విప‌క్ష స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌కు అరుణ్‌జైట్లీ స‌మాధానం ఇచ్చారు. వార్దా తుపాను అనంత‌రం ఏర్ప‌డిన న‌ష్టంపై తాము ముమ్మ‌రంగా స‌హాయ‌కచ‌ర్య‌లు చేపట్టామ‌ని అన్నారు.

More Telugu News