: నూతన వధూవరులకు క్యాష్ ప్రీపెయిడ్ కార్డును కానుకగా ఇచ్చిన జార్ఖండ్ ముఖ్యమంత్రి!

పెద్ద నోట్ల ప్రభావంతో పెళ్లి చేసుకుంటున్నవారు నానా బాధలు పడుతుంటే... పెళ్లికి వస్తున్న వారి పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటోంది. చేతిలో డబ్బు లేకపోవడంతో కానుకలు ఇవ్వలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో నూతన వధూరులకు జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ఓ వినూత్న కానుకను ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే, ఇటీవల ఓ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడి పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి సీఎం హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి, వారికి క్యాష్ ప్రీపెయిడ్ కార్డును బహూకరించారు. ప్రతి జిల్లాలోని ఒక బ్లాక్ ను ఈ నెలాఖరులోగా నగదు రహిత లావాదేవీల దిశగా మళ్లించాలని జార్ఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఇచ్చిన గిఫ్ట్ అందరి మన్ననలనూ అందుకుంటోంది. ముఖ్యమంత్రి అందరికీ స్ఫూర్తిదాతగా నిలుస్తున్నారంటూ పలువురు కొనియాడుతున్నారు. 

More Telugu News