: జనవరి వరకు మీడియా ముందుకు రాకూడదని నిర్ణయించుకున్న ట్రంప్
అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే జనవరి వరకు మీడియా ముందుకు రాకూడదని నిర్ణయించుకున్నారు. జనవరిలో పదవీ బాధ్యతలు చేపట్టాల్సిన నేపథ్యంలో క్రిస్మస్ కు ముందే దేశ ప్రజలకు తన పాలనా పద్ధతులు, వివాదాస్పద అంశాల్లో తన వైఖరి, దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తాను సిద్ధం చేసిన నూతన విధానాలు, ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలు నెరవేర్చేందుకు తీసుకోనున్న చర్యలను వివరించాలని భావించారు. అయితే శ్వేత సౌధం నుంచి అధికార బదిలీ వ్యవహారాలు చూస్తున్న ట్రంప్ ఇప్పుడే మీడియా సమావేశం నిర్వహించి, దేశ ప్రజలకు సందేశం ఇవ్వాలని భావించడం లేదని, జనవరిలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా, చెప్పాలనుకున్నది చెప్పవచ్చని భావిస్తున్నారని ట్రంప్ అధికారప్రతినిధి హోప్ హిక్స్ తెలిపారు.