br shetty medicity: అమరావతిలో బీఆర్ శెట్టి మెడిసిటీకి వంద ఎకరాల కేటాయింపు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బీఆర్ శెట్టి మెడిసిటీ-హెల్త్ కేర్ కు వంద ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ సంస్థకు ఎకరం 50 లక్షల రూపాయల చొప్పున భూమిని కేటాయించినట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం కేటాయించిన భూమిలో బీఆర్ శెట్టి గ్రూప్ 11 వ్యాపారాలు ప్రారంభించనున్నట్టు తెలిపింది. మెడికల్ యూనివర్సిటీ, దాని అనుబంధ ఆసుపత్రి, బిజినెస్ స్కూల్, త్రీస్టార్ హోటల్, వంద సర్వీస్ అపార్ట్‌ మెంట్లు వైద్యపరికరాల తయారీ యూనిట్, యోగా సెంటర్, క్వాంటం ఎనలటిక్ సెంటర్‌ ను నిర్మించనున్నారు. 
br shetty medicity
amaravati

More Telugu News