vidya balan: తనకు సూపర్ ఉమన్ అనిపించుకోవాలని లేదంటున్న బాలీవుడ్ హీరోయిన్

తనకు సూపర్ ఉమన్ అనిపించుకోవాలన్న కోరిక లేదని ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ తెలిపింది. ముంబైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా విద్యాబాలన్ మాట్లాడుతూ, సమాజం ఆలోచనా ధోరణి మారాలని సూచించింది. ఇంటిపనంతా చక్కబెట్టిన తరువాత షూటింగ్ కు వెళ్లడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించింది. షూటింగ్ లో ఉన్నప్పుడు షూటింగ్, ఇంట్లో ఉన్నప్పుడు ఇల్లు.. ఇలా ఫర్వాలేదు కానీ, రెండు పనులను ఒకేసారి చక్కదిద్దమంటే ఎలా సాధ్యమని ప్రశ్నిస్తోంది.

షూటింగ్ పని మీద బయటకు వెళ్లాల్సి వస్తే, అదే సమయంలో ఇంట్లో ఏదైనా అకేషన్ ఉంటే దానికి అటెండ్ కాలేకపోతే గిల్టీగా ఉంటుందని చెప్పింది. తాను మహిళను కావడం వల్లే అలా అనిపిస్తుందని చెప్పింది. మనసమాజంలో మహిళల ఆలోచనా ధోరణి అలాగే ఉందేమో అనిపిస్తుందని, కొన్నిసార్లు ఇల్లు, ఉద్యోగం ఒకేసారి చక్కదిద్దడం కుదరదని, అలాంటప్పుడు రెండూ చక్కదిద్దాలన్న ఆలోచన సరికాదని చెప్పింది. తనకు సినిమాలు చేయడం ఇష్టం కనుక ఎంతసేపు పని చేసినా కష్టం అనిపించదని తెలిపింది.  
vidya balan
bollywood heroine
work home balance

More Telugu News