: అందుకే 2 వేల నోట్లు దొరికిపోతున్నాయట.. కొత్త పెద్ద నోటుపై మరో పుకారు షికార్!
పెద్ద నోట్ల రద్దు తర్వాత విడుదలైన రూ. 2000 నోటుపై జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. నోటులో చిప్ పెట్టారని... అందువల్ల ఆ నోట్లను ఎక్కువ మొత్తంలో ఒకే చోట పెడితే, తెలిసిపోతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, అలాంటిది ఏమీ లేదని ఆర్బీఐ స్పష్టత ఇచ్చింది. దీంతో, ఆ ప్రచారం ఆగిపోయింది. తాజాగా, మరో ప్రచారం ఊపందుకుంది. నోటును ముద్రించడానికి ఉపయోగించిన ఇంకులో పీ-32 అనే రేడియోధార్మిక ఫాస్పరస్ ఐసోటోప్ ఉందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ రేడియోధార్మికత వల్లే చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, పూణె, వెల్లూరు తదితర నగరాల్లో పెద్ద ఎత్తున కొత్త నోట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారనే కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఒకే ప్రదేశంలో పెద్దఎత్తున పీ-32 అనే పదార్థం ఉంటే... వెంటనే దాన్ని గుర్తించవచ్చని... అందుకే 2000 విలువైన కొత్తనోట్లు ఎక్కువగా ఉన్న ప్రదేశాలన్నీ దొరికిపోయాయని, భారీగా కొత్త కరెన్సీని స్వాధీనం చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రేడియోధార్మిక పదార్థం వల్ల ఎలాంటి అపాయం ఉండదని... ఆరోగ్యానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని మరికొందరు చెబుతున్నారు.