: ఆర్బీఐ సీనియర్ స్పెషల్ అసిస్టెంటు అరెస్టు.. రూ.16 లక్షల కొత్త నోట్లు స్వాధీనం

దేశంలో నల్లధనాన్ని అరికట్టడానికి పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయం అమలులో కొందరు బ్యాంకు ఉద్యోగులు అవినీతికి పాల్పడుతున్నారు. చాలామంది ఉద్యోగులు క‌మీష‌న్ల క‌క్కుర్తికి ఆశ‌ప‌డి నల్లకుబేరులతో చేతులు క‌లిపి, కోట్లలో కొత్త‌నోట్ల‌ను మార్చుతున్న విష‌యం తెలిసిందే. ఆర్‌బీఐకి చెందిన ఓ సీనియర్‌ స్పెషల్‌ అసిస్టెంట్ కూడా ఇటువంటి చ‌ర్య‌కే పాల్ప‌డ్డాడు. ఎట్ట‌కేల‌కు సీబీఐ అధికారులు బెంగళూరులో ఆయ‌న‌ను ఈ రోజు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆర్‌బీఐ అధికారితో పాటు మరో ఇద్దరిని కూడా సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.16 లక్షల కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News