: నానక్ రామ్ గూడ భవనం అనుమతులకు 5 లక్షల లంచం.. జీహెచ్ఎంసీ ఉద్యోగుల అరెస్ట్!


హైదరాబాదులోని నానక్ రామ్ గూడలో కుప్పకూలిన ఏడంతస్తుల భవన నిర్మాణానికి సంబంధించిన జీహెచ్ఎంసీ అధికారుల అవినీతి వెలుగు చూసింది. నానక్ రామ్ గూడలోని ఆ భవనానికి అనుమతులు లేనప్పటికీ సత్తూ సింగ్ సదరు నిర్మాణం చేపట్టాడంటూ పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే అది అవాస్తవమని, జీహెచ్ఎంసీ ట్యాక్స్‌ ఇన్‌ స్పెక్టర్‌ సంజయ్‌ కుమార్‌ సహోద్యోగి నరహరితో కలిసి 5 లక్షల రూపాయలు లంచం తీసుకుని అనుమతులు ఇచ్చినట్టు దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ ఘటనలో మొత్తం ముగ్గుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న రాత్రి కొచ్చిలో సత్తూసింగ్ ను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News