: ఇంతవరకు సాధించిన విజయాలకంటే నేటి విజయం ఎక్కువ ఆనందాన్నిచ్చింది: కోహ్లీ
ఇంతవరకు సాధించిన విజయాల కంటే నేటి విజయం ఎక్కువ ఆనందాన్నిచ్చిందని టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన నాలుగో టెస్టు ముగిసిన అనంతరం ఆండర్సన్ తో వివాదంపై ప్రశ్నించగా, తనకు మ్యాచ్ ముగియడానికి కొద్ది సేపటి ముందు విషయం తెలిసిందని అన్నాడు. ఆండర్సన్ ఏమన్నాడో తనకు తెలియదని, చివర్లో అశ్విన్ చెప్పాడని అన్నాడు. ఆండర్సన్ మాటలపై అశ్విన్ అసంతృప్తి చెందాడని అన్నాడు. అదే విషయాన్ని ఆండర్సన్ కు అశ్విన్ తెలిపాడని చెప్పాడు. దీంతో ఇది ముగిసిందని, ఇక ముందుకు సాగుదామని ఆండర్సన్ కు తాను చెప్పానని, అంతకు మించి ఏమీ జరగలేదని కోహ్లీ తెలిపాడు. కాగా, ఈ మ్యాచ్ లో కోహ్లీ డబుల్ సెంచరీ సాధించగా, ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు సెంచరీలతో అతనికి సహకరించారు. దీంతో ఈ టెస్టులో ఇన్నింగ్స్ 36 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించడం విశేషం.