: మా నాన్న నుంచి ఆ లక్షణాన్ని వంటబట్టించుకుంటున్నాం: రజనీకాంత్ కూతురు సౌందర్య

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ రోజు 66వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా రజనీకాంత్ కూతురు సౌందర్య ఒక ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘మా నాన్నా చాలా సాధారణంగా ఉంటారు. తన మూలాలను మర్చిపోని వ్యక్తి.  నా సోదరి ఐశ్వర్య, నేను ఈ లక్షణాన్నిఆయన నుంచి  వంటబట్టించుకుంటున్నాం. మా నాన్న తన ప్రొడ్యూసర్లతో, అభిమానులతో ఎలా ఉంటారో, అందరినీ అదే విధంగా చూస్తారు, గౌరవిస్తారు. మా నాన్న పైకి ఒకలా, లోపల మరోలా ఉండరు.. రెండు ముఖలాతో ప్రవర్తించరు’ అని సౌందర్య చెప్పింది.
  

  • Loading...

More Telugu News