: మోదీజీ ఇంకా ఎంతమంది మరణించాలి?: మమతా బెనర్జీ
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి ప్రధాని మోదీపై ధ్వజమెత్తారు. 'మోదీ బాబూ...మీ దయవల్ల ఇంకా ఎంత మంది ప్రాణాలు కొల్పోవాలి?' అంటూ ఆమె ట్వీట్ చేశారు. దీనిని ఆ పార్టీ ఎంపీ డెరిక్ ఓబ్రెయిన్ రీ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పెద్ద నోట్ల రద్దు అనంతరం క్యూ లైన్లలో నిల్చుని, ఇతర నగదు ఇబ్బందుల వల్ల సుమారు 95 మంది మృతి చెందారని ఆయన గుర్తు చేశారు. ఈ ట్వీట్ కి తృణమూల్ అభిమానుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.